కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కల్లెడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ముంజాల సురేష్ (30) భార్య కళ్యాణి కొద్దిరోజులుగా కాపురానికి రావడం లేదు. దీంతో అతడు మనోవేదనకు గురై ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి ఆవరణలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
Aug 29 2016 12:30 AM | Updated on Nov 6 2018 8:04 PM
పర్వతగిరి : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కల్లెడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ముంజాల సురేష్ (30) భార్య కళ్యాణి కొద్దిరోజులుగా కాపురానికి రావడం లేదు. దీంతో అతడు మనోవేదనకు గురై ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి ఆవరణలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. సురేష్ తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బూరగు వెంకట్రావు తెలిపారు. సురేష్ కుటుంబ సభ్యులను వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేష్ పరామర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులు ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, పల్లెపాటి శాంతిరతన్‌రావు, పట్టాపురం ఏకాంతం, బోయినపల్లి యుగంధర్‌రావు, మాదాసి సుధాకర్, చినపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొంపెల్లి దేవేందర్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Advertisement
Advertisement