ఖిల్లాఘనపురం : మండలంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువద్దామని జెడ్పీసీఈఓ లక్షీ్మనారాయణ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీడీఓ రెడ్డయ్యలతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
90 శాతం మరుగుదొడ్లు పూర్తి
Sep 4 2016 12:09 AM | Updated on Sep 4 2017 12:09 PM
ఖిల్లాఘనపురం : మండలంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువద్దామని జెడ్పీసీఈఓ లక్షీ్మనారాయణ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీడీఓ రెడ్డయ్యలతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిల్లాఘనపురం మారుమూల మండలమైనప్పటికీ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు వందశాతం పూర్తి చేయాలన్నారు. బిల్లులకు ఇబ్బంది కలగకుండా గ్రామ కమిటీల ద్వారా నేరుగా చెల్లిస్తామని, హౌసింగ్ పథకంలో కొంత వరకు బిల్లులు వచ్చిన వారికి మిగతా బిల్లులు అందజేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోపు పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవీందర్, పీఆర్‌ఏఈ రమేష్‌నాయుడు, ఈఓపీఆర్డీ వినోద్‌కుమార్‌గౌడ్, ఏపీఓ సురేష్, ఘనపురం సర్పంచ్ సౌమ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement