8,207 ఇళ్లు మంజూరు | 8207 house sanctioned | Sakshi
Sakshi News home page

8,207 ఇళ్లు మంజూరు

Dec 24 2016 11:10 PM | Updated on Sep 4 2017 11:31 PM

8,207 ఇళ్లు మంజూరు

8,207 ఇళ్లు మంజూరు

జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఏడు మునిసిపాలిటీకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8,207 ఇళ్లు మంజూరయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు.

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఏడు మునిసిపాలిటీకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8,207 ఇళ్లు మంజూరయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. గృహ నిర్మాణానికి అవసరమైన రుణాన్ని లబ్ధిదారులకు బ్యాంకర్లు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏల్‌డీఎంను ఆదేశించారు. శనివారం పట్టణ గృహ నిర్మాణాలపై ఆయన తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

జేసీ మాట్లాడుతూ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద గుంతకల్లు మునిసిపాలిటీకి 2,000, అనంతపురం కార్పొరేషన్‌కి 2,000, ధర్మవరానికి 1,400, రాయదుర్గంకి 1,307, హిందూపురానికి 500, కదిరి మునిసిపాలిటీకి 1,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పథకం కింద ఒక్కో గృహ నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షలు అన్నారు. ఇందులో సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుందన్నారు. లబ్ధిదారుని వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణంగా రూ.75 వేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులకు బ్యాంక్‌ రుణం రూ.75 వేలు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement