మాట్లాడుతున్న ఆర్‌ఎం వినోద్‌కుమార్
కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్ అన్నారు.
అచ్చంపేట రూరల్ : కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పుష్కర ఘాట్లకు 400బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన ఘాట్ల వద్దకు ప్రత్యేక బస్సులను నడిపిస్తామన్నారు. దోమలపెంట నుంచి పాతాళగంగ వరకు ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను చేరవేస్తామన్నారు. అచ్చంపేటకు రెండు మినీ బస్సులు మంజూరయ్యాయని, నిత్యం ఉమామహేశ్వరానికి నడిపిస్తామన్నారు. సంస్థ తరఫున పుష్కరాలను ఇద్దరు ఆర్‌ఎంలు, ఆరుగురు డివిజన్‌స్థాయి అధికారులు, 12మంది డీఎంలు, 18మంది సీఎస్‌లు, 25మంది టీఐలు, 50మంది కంట్రోలర్లు పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం నారాయణ, సిబ్బంది సురేందర్, జోగమ్మ, వీసీమౌళి, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌లాల్, కార్మిక సంఘం నాయకుడు రాములు తదితరులు పాల్గొన్నారు.