సోమశిలకు 8646 క్యూసెక్కులు | 37.5 TMC's at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలకు 8646 క్యూసెక్కులు

Dec 14 2016 12:37 AM | Updated on Sep 4 2017 10:38 PM

సోమశిలకు 8646 క్యూసెక్కులు

సోమశిలకు 8646 క్యూసెక్కులు

సోమశిల: బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి మంగళవారం 8,646 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

  •  జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ 
  • సోమశిల:  బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి మంగళవారం 8,646 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.  జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు విడుదలవుతున్న  నీటిని నిలుపుదల చేశారు. అలాగే ఉత్తర, దక్షిణ కాలువలకు కూడా నిలిపి వేశారు. ప్రస్తుతం జలాశయంలో 93.555 మీటర్లు , 306.501 అడుగు మట్టం నమోదైంది. జలాశయం వద్ద 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
     
     
     

Advertisement
 
Advertisement
Advertisement