30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను మైదుకూరు కోర్టులో శుక్రవారం హాజరు పరచినట్లు మైదుకూరు, దువ్వూరు ఎస్‌ఐలు చలపతి, విద్యాసాగర్ తెలిపారు.
మైదుకూరు టౌన్: 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను మైదుకూరు కోర్టులో శుక్రవారం హాజరు పరచినట్లు మైదుకూరు, దువ్వూరు ఎస్‌ఐలు చలపతి, విద్యాసాగర్ తెలిపారు. మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన కడప, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐలు చెప్పారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు వివరించారు.