విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి | 3 years old boy died due current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

Aug 8 2016 3:48 PM | Updated on Sep 4 2017 8:25 AM

అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ కు గురై చనిపోయాడు.

బిక్కబోలు: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ కు గురై చనిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు గ్రామానికి చెందిన నానిబాబు(3) సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి తల్లితో కలసి వెళ్లాడు. అయితే, తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్న నాని బాబు సమీపంలో తెగిపడి కిందికి వేలాడుతున్న కరెంటు తీగలను తాకాడు. విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement