ఆపదలు, సమస్యల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి సత్వరమే పరిష్కారం చూపడం కోసం ఏర్పాటు చేసిన డయల్–100కు అక్టోబర్‌లో 2,566 కాల్స్ అందాయని జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు తెలిపారు.
అనంతపురం సెంట్రల్ : ఆపదలు, సమస్యల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి సత్వరమే పరిష్కారం చూపడం కోసం ఏర్పాటు చేసిన డయల్–100కు అక్టోబర్‌లో 2,566 కాల్స్ అందాయని జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు తెలిపారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నారన్నారు. గత నెలలో ప్రతి రోజూ సగటున సుమారు 83 కాల్స్ వచ్చాయన్నారు.
దాడులకు సంబంధించి 367, రోడ్డు ప్రమాదాలు 1134, చోరీలు 60, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు 37, మహిళలకు సంబంధించినవి 188, అల్లర్లు 99, న్యూసెన్స్ 197, స్వతహాగా గాయపడినవి 168 తదితర సమస్యలు వచ్చినట్లు వివరించారు. ఇందులో 101 కేసులు కూడా నమోదు చేశారన్నారు. ఫిర్యాదు చేసిన బాధితులకు వందశాతం న్యాయం జరుగుతుందన్నారు.