22న బీసీల చలో విజయవాడ | 22nd bc sabha at vijayawada | Sakshi
Sakshi News home page

22న బీసీల చలో విజయవాడ

Jul 17 2016 10:09 PM | Updated on Sep 4 2017 5:07 AM

కాపులను బీసీ జాబితాలో చేర్చడం తగదంటూ బీసీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 22న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ..

కొత్తపేట : కాపులను బీసీ జాబితాలో చేర్చడం తగదంటూ బీసీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 22న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేందుకు నియమించిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథన్‌కు తమకు జరిగే అన్యాయాన్ని వినతిపత్రం ద్వారా వివరించనున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బీసీలు 22న ఉదయం రావులపాలెం సెంటర్‌కు చేరుకుని, అక్కడి నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నట్టు తెలిపారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, సభ్యులు తరలిరావాలని పిలుపునిచ్చారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement