విశాఖపట్నం జిల్లా అరకులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అరకులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి సమీపంలో నిన్న(ఆదివారం) 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.