జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది
రామచంద్రాపురం(చిత్తూరు): జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నేతకుప్పం గ్రామంలో ఆదివారం జరుగుతున్న జల్లికట్టులో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. జల్లికట్టును తమ కెమరాల్లో బంధించడానికి యత్నిస్తున్న ఇద్దరు యువకులకు కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.