17న భారతజాతి ఐక్యతదినం | 17 indian unity day | Sakshi
Sakshi News home page

17న భారతజాతి ఐక్యతదినం

Sep 1 2016 11:27 PM | Updated on Sep 4 2017 11:52 AM

కొత్తకోట రూరల్‌ : ఒకే నాగరికత, సంస్కృతి గల భారతజాతి తొలిసారిగా ఒకే ప్రభుత్వం, ఒకే పతాకం కిందకు వచ్చిన రోజుగా సెప్టెంబర్‌ 17ను రాష్ట ప్రభుత్వం అధికారిక పర్వదినంగా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి అన్నారు.

కొత్తకోట రూరల్‌ : ఒకే నాగరికత, సంస్కృతి గల భారతజాతి తొలిసారిగా ఒకే ప్రభుత్వం, ఒకే పతాకం కిందకు వచ్చిన రోజుగా సెప్టెంబర్‌ 17ను రాష్ట ప్రభుత్వం అధికారిక పర్వదినంగా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 17ను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అ«ధికారికంగా చేపట్టాలని నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, మండల నాయకులు మాధవరెడ్డి, దాసరి నరేష్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సాయిరాం కూర్చున్నారు. వారికి మద్దతుగా టీడీపీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు నాగన్నయాదవ్, ఉమామహేశ్వర్‌రెడ్డి, నాయకులు సత్యం యాదవ్, బాల్‌రాజు, తిరుపతయ్య మద్దతు తెలిపారు. రతంగ్‌పాండ్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం కోసం రాచరికానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అనేక మంది చేసిన పోరాటానికి ఫలం అన్నారు. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనకు, మతానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అనంతరం బీజేపీ మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మాజారెడ్డి ముగింపు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement