డి.కుప్పంలో 16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 16 gamblers arrested in Dasu Kuppam | Sakshi
Sakshi News home page

డి.కుప్పంలో 16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Sep 22 2016 9:13 AM | Updated on Sep 4 2017 2:32 PM

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 16 మందిని పేకటారాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు కార్లతోపాటు 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిలో అధికంగా తమిళనాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారంతా ప్రముఖులే అని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement