కేసీకి 130 క్యూసెక్కుల నీరు విడుదల | 130 cuces water relese to kc | Sakshi
Sakshi News home page

కేసీకి 130 క్యూసెక్కుల నీరు విడుదల

Feb 8 2017 11:06 PM | Updated on Sep 5 2017 3:14 AM

సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు బుధవారం డ్యాం అధికారులు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సుంకేసుల(గూడూరు రూరల్) : సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు బుధవారం డ్యాం అధికారులు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు కేసీ ద్వారా 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో  0.35 టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ మునిస్వామి తెలిపారు.  తుంగభద్రా డ్యాం నుంచి రావలసిన కోటా పూర్తయిందని, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి సుంకేసులకు నీరు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement