రాష్ట్రంలో 106 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయగా వాటిలో జిల్లాలో డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరోచోట సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సీఈవో డాక్టర్ గంటా సుబ్బారావు చెప్పారు. మంగళవారం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన సందర్శించారు
రాష్ట్రంలో 106 స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్స్
Nov 22 2016 6:05 PM | Updated on Sep 4 2017 8:49 PM
భీమవరం: రాష్ట్రంలో 106 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయగా వాటిలో జిల్లాలో డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరోచోట సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సీఈవో డాక్టర్ గంటా సుబ్బారావు చెప్పారు. మంగళవారం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడుతూ నైపుణ్య వికాస కార్యక్రమాల గురించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, ఏపిఎస్‌ఎస్‌బీసీ బృందం సభ్యురాలు లక్ష్మి ఉన్నారు.
Advertisement
Advertisement