కాకినాడ సముద్ర తీరంలో కాకినాడ బోటుకు ప్రమాదం తప్పింది.
కాకినాడ: కాకినాడ సముద్ర తీరంలో మంగళవారం కాకినాడ బోటుకు ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్తున్న రెండు బోట్లు బంగాళాఖాతంలో ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన బోటు మునిగిపోయింది.
అయితే మునిగిపోయిన బోటులో 10 మంది మత్స్యకారులు ఉన్నారు. అప్రమత్తమైన మత్స్యకారులు మునిగిపోయిన బోటులో నుంచి సురక్షితంగా బయట పడినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.