పోర్ట్ల్యాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు | telangana developement forum conducts Telangana formation day | Sakshi
Sakshi News home page

పోర్ట్ల్యాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jul 6 2017 10:34 PM | Updated on Sep 5 2017 3:22 PM

పోర్ట్ల్యాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

పోర్ట్ల్యాండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ల్యాండ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్..

పోర్ట్ల్యాండ్ : అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ల్యాండ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్ట్ల్యాండ్ చాప్టర్ ఛైర్మన్ శ్రీని అనుమాండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకలకి పోర్ట్ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తెలంగాణ ధూమ్ ధామ్ సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు పాల్గొని ఆటా,పాటలతో ప్రేక్షకులను అలరించారు.
 
టీడీఎఫ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి శ్రీని అనుమండ్ల వివరిస్తూ, ఈ వేడుకలు జరగడానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీఎఫ్ పోర్ట్ల్యాండ్ చాప్టర్ టీం కొండల్ రెడ్డి, పుర్క రఘు స్వామి,  మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కాంత్ కొడిదేటి, నిరంజన్ కూర, నరెందర్ చీటి, శివ ఆకుతోట, రాజ్ అందోల్, వీరేష్ బుక్కా, జయాకర్ రెడ్డి అడ్డ, సందీప్ రెడ్డి ఆశ, ప్రవీణ్, భాను పోగుల, సురేశ్ దొంతుల, ప్రవీణ్ ఎలకంటి, అజయ్ అన్నమనేని, హరినందన్ సదిరెడ్డి, వెంకట్ ఇంజం, సత్య సింహరాజులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement