రాష్ట్ర డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం | Cisco participation in state digital programs | Sakshi
Sakshi News home page

రాష్ట్ర డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం

May 27 2017 2:48 AM | Updated on Sep 5 2017 12:03 PM

రాష్ట్ర డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం

రాష్ట్ర డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం

తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు నెట్‌వర్కింగ్‌ దిగ్గజం సిస్కో ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు.

► ఇందుకు సిస్కో ఆసక్తి చూపిందన్న మంత్రి కేటీఆర్‌
► మిషన్‌ భగీరథ, టీ–హబ్‌పై అవగాహన ఉందన్న సిస్కో చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు నెట్‌వర్కింగ్‌ దిగ్గజం సిస్కో ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. శుక్రవారం అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. సంస్ధ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డిజిటల్‌ ఇండియా, డిజిటల్‌ తెలంగాణ విషయంలో సిస్కో ప్రణాళికలను మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, టీ–హబ్‌ వంటి కార్యక్ర మాలపై తనకు అవగాహన ఉందన్నారు.

డిజిటలైజేషన్‌తో ప్రజల జీవితాల్లో మార్పులు...
ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించటం ద్వారా డిజిటల్‌ తెలంగాణ సాధ్యమని జాన్‌ చాంబర్స్‌ తెలిపారు. డిజిటైజేషన్‌తో ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని, అర్థిక వ్యవస్ధ బలోపేతం అవుతుందని ఆయన మంత్రికి వివరించారు. వీడియో ఇంటరాక్టివ్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ–హెల్త్, ఈ–ఎడ్యుకేషన్‌ రంగాల్లో అనేక ప్రయోజనాలుంటా యన్నారు. ఈ మేరకు తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.

ఇందుకుగానూ తెలంగాణ ప్రభు త్వంతో చర్చించాలని సిస్కో ఇండియా బృందాన్ని చాంబర్స్‌ ఆదేశిం చారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. తెలంగాణ డిజిటలైజేషన్‌ రంగంలో చేపట్టిన పలు అంశాలను సిస్కో చైర్మన్‌కు వివరించారు. డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాల గురించి తెలిపారు. డిజిటల్‌ మౌలిక వసతుల రంగంలో ఫైబర్‌ గ్రిడ్‌ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement