అంతర్జాతీయ టెలిఫోన్‌ కాల్స్‌ దొంగల ముఠా అరెస్ట్‌ | YSR District Rajam Peta Police Arrest International Telephone Calls Thief | Sakshi
Sakshi News home page

రు.32 కాల్‌ను.. రూ.6కు అమ్ముతూ కోట్లు దోచిన వైనం

Sep 20 2019 12:12 PM | Updated on Sep 20 2019 12:23 PM

YSR District Rajam Peta Police Arrest International Telephone Calls Thief - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: రాజంపేట పోలీసులు శుక్రవారం అంతర్జాతీయ టెలిఫోన్‌ కాల్స్‌ దొంగల ముఠాను అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రెండేళ్లుగా ప్రభుత్వ టెలిఫోన్‌ కాల్స్‌ దొంగతనం చేయబడ్డాయంటూ టెలికాం అధికారులు రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజంపేట రెడ్డివారి వీధిలో  నిర్వహిస్తున్న ఇంటర్నెట్ ఆధారిత అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్  కేంద్రంపై దాడి చేశారు. ఈ ముఠా 32 రూపాయల ఫోన్‌ కాల్‌ను రూ. 6కే అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టెలిఫోన్‌ కాల్స్‌ కేంద్రం నిర్వహకుడు లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం అతను కువైట్‌లో ఉంటున్నాడన్నారు. ఈ క్రమంలో రాజంపేట పట్టణానికి చేందిన సయ్యద్ మొహమ్మద్ షరీఫ్ (మున్నా), రాజశేఖర్ నాయుడు, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్ రాజులు లక్ష్మీనారాయణకు సహకరిస్తూ.. రూ. కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరి ముగ్గురి మీద కేసు నమోదు చేశామని.. వారి వద్ద నుంచి 500 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement