రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుల మృతి | YS Jagan Mohan Reddy Condolence To YSRCP Leaders Who Died In Road Accident | Sakshi
Sakshi News home page

వైస్సార్‌సీపీ నాయకుల మృతి.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Jun 13 2019 7:42 AM | Updated on Jun 13 2019 9:48 AM

YS Jagan Mohan Reddy Condolence To YSRCP Leaders Who Died In Road Accident - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తుని సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకి చెందిన పప్పల నారాయణ మూర్తి, బడాన లక్ష్మి నాయుడు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. కాగా  ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం నేడు స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీళ్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై తమ్మినేని కూడా దిగ్ర్భాంతి చెందారు. మరోవైపు గాయపడిని వారిని వెంటనే మెరగైన చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement