అన్నా.. అమ్మను తిట్టకురా..

Young Man Commit To Suicide - Sakshi

ఆస్తి మొత్తం నువ్వే తీసుకో

డెత్‌ నోట్‌ రాసి.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

మినీ రైల్వేబ్రిడ్జి వద్ద ఘటన

రైల్వేగేట్‌: అన్నా.. అమ్మ ను తిట్టకురా.. అమ్మ ఏం దాసుకోలేదురా..ఆస్తి మొత్తం నువ్వే తీసుకో.. నువ్వు కూడా జాగ్రత్త.. నేను చనిపోతున్నాను..అమ్మకు చెప్పకు..’ అని డెత్‌నోట్‌ రాసి ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన జంగం పూర్ణచందర్‌(25) హన్మకొండలోని ఓ ప్రవేట్‌ కళాశాలలో బీఎస్సీ చదివి ఫెయిలయ్యాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ సెల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా డు.

ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చిన పూర్ణచందర్‌ రాత్రి తల్లి లక్ష్మికి చెప్పి బయటికి వెళ్లాడు. గురువారం ఉదయం హంటర్‌రోడ్డు మినీబ్రిడ్జి సమీ పంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ తెలిపారు.  డెత్‌ నోట్‌ రాసుకుని పూర్ణచందర్‌ ఆత్మహత్య చేçసుకున్న ట్లు సీఐ చెప్పారు. పూర్ణచందర్‌ ఆత్మ హత్యతో తల్లి లక్ష్మి రోదనలు మిన్నంటా యి. డబ్బుల విషయమై మృతుడి అన్న వెంకటేష్‌ మందలించడంతోనే పూర్ణచందర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యలు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top