ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య | Wife Killed Husband With Her Boyfriend in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

Oct 17 2019 7:40 AM | Updated on Oct 17 2019 7:40 AM

Wife Killed Husband With Her Boyfriend in Tamil Nadu - Sakshi

భర్త మురుగన్, దేవి, ప్రియుడు వినోద్‌

తమిళనాడు , తిరువొత్తియూరు: గుమ్మడిపూండి, సున్నాంబు కులం సమీపంలో సెంగల్‌ చూలైమేడు ప్రాంతానికి చెందిన మురుగన్‌ (38). అతని భార్య దేవి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 12వ తేది రాత్రి మురుగన్‌ హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఆరంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ వినోద్‌తో దేవికి వివాహేతర సంబంధం ఉందని.. దీన్ని భర్త ఖండించడంతో వినోద్‌తో భర్తను హత్య చేయించినట్టు తెలిసింది. దీంతో దేవిని పోలీసులు అరెస్టు చేశారు. హంతకుడు వినోద్‌ హత్య చేసిన మరుసటి రోజు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆరోగ్యం కుదుటపడిన తరువాత అరెస్టు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement