అనుమానం..పెనుభూతం

Wife Killed Husband In Erragadda Hyderabad - Sakshi

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

భర్తను హత్య చేసిన భార్య

అమీర్‌పేట: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ భర్తను  దారుణంగా  హత్య చేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ న్యూ సుల్తాన్‌ నగరన్‌లో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన భైరయ్య (33), స్వర్ణ దంపతులకు 2013 వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

యురేకా ఫోబ్స్‌లో పనిచేసే భైరయ్య కుటుంబంతో కలిసి సుల్తాన్‌ నగర్‌లో ఉంటున్నాడు. కాగా భైరయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం  ఉందని స్వర్ణ అనుమానం పెంచుకుంది. ఈ విషయమై తరచూ ఇద్దరి మధ్య  గొడవలు  జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. అర్థరాత్రి నిద్రపోతున్న బైరయ్య తలపై బండరాయితో  మోది దారుణంగా హత్య చేసింది. ఉదయం సమీపంలో ఉన్న బైరయ్య స్నేహితుడు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లిన స్వర్ణ తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరింది. అక్కడికి వచ్చిన శ్రీకాంత్‌ రక్తపు మడుగులో పడి ఉన్న బైరయ్యను చూచి పోలీసులకు  సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే భైరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వర్ణపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు  తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top