బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం

We will do justice to the girl  family - Sakshi

జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి

నెక్కొండ : ఎలాంటి సంబంధం లేని ఓ బాలిక అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) మహేందర్‌రెడ్డి అన్నారు.

మండలంలోని బంజరుపల్లి శివారు ధర్మతండాలో ఈ నెల 30న రాళ్లు విసరడంతో అదే తండాకు చెందిన బాలిక అఖిల మృతిపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు.

బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న మరుసటి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై నవీన్‌కుమార్‌లను కలిసి వివరాలు తీసుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు.

బాధిత కుటుంబ నేపథ్యం ప్రకారం.. వారి ఆర్థిక విషయాలపై గొవడకు కారణం, బాలిక మృతిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ రిపోర్టును మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు, జిల్లా ఉన్నతాధికారులు, బాలల సంక్షేమ కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు.

బాలిక తల్లిదండ్రులకు నాలుగో సంతా నం కాగా, పదో తరగతి చదివిన పెద్ద కూతురు(మూగ)కు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆమెను వృత్తి విద్యా కోర్సు చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అలాగే రెండో కుమార్తెకు వివాహం జరుగగా, మూడో కుమార్తెను నెక్కొండ కస్తూర్భా గురుకులంలో 8వ తరగతిలో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం తరుఫున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణలో అంగన్‌వాడీ టీచర్‌ సుధ, ఆయా పూలమ్మ, తండావాసులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top