
భువనగిరిఅర్బన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దు ర్మరణం చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని కూనూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.వివరాలు.. గుండాల మండలం సుద్దాలకు చెందిన బుర్ర దశరథ(48), అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆత్మకూరు(ఎం) మండలంలో తమ బంధువుల ఇళ్లలో జరిగే వేడుకకు కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వెళ్లారు. సాయంత్రం దశరథ తన కుమారుడు అనిల్(27) తో కలిసి బైక్‌పై తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ శివారులో ఉన్న యాదాద్రి ఫంక్షన్‌హాల్ వద్దకు రాగానే వీరి బైక్‌ను గుర్తు తెలియని ఆటో ఢీకొ ట్టింది. దీంతో అనిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన దశరథను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు.