యువతిపై లైంగిక దాడి.. బెదిరింపు

Tv Reporter Molestation On Young Woman West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: యువతిపై అత్యాచారంచేసి చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.దుర్గారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడిలో చానల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో శ్రీ విష్ణు ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న కాగిత సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు. సత్యనారాయణ స్థానిక రాజులకాలనీలో నివసిస్తున్న ఒక యువతితో సన్నిహితంగా ఉండేవాడు. యువతి నిజామాబాద్‌లో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం వరకు చదివి మానేసింది. ఆమె బీటెక్‌ చదువుతున్న సమయంలో నిజామాబాద్‌ వెళ్లేందుకు ట్రావెల్స్‌లో టికెట్‌ కోసం సత్యనారాయణ వద్దకు వెళ్లేది. అదేసమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది. ఇదే అదునుగా సత్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లి  కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. వారి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు.

అప్పటికే సత్యనారాయణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండటంతో యువతి నిరాకరించింది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సత్యనారాయణ ఆమెను బెదిరించాడు. యువతిని స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేర్పించారు. తరచూ ఆమెను మోటార్‌సైకిల్‌పై, కారుపై తిప్పుతూ ఈ క్రమంలో మత్తుమందు ఇచ్చి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె మత్తులో ఉండగా అసభ్య వీడియోలు, ఫొటోలు తీశాడు. మత్తులో ఉన్న సమయంలో తనతో వ్యభిచారం కూడా చేయించేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో సత్యనారాయణ గతనెల 15న తనను తీసుకువెళ్లి ఉప్పలపాడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో బలవంతంగా తాళి కట్టినట్టు ఆమె పేర్కొంది. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం యువతి తల్లితండ్రులు ఆమెకు రాజమండ్రికి చెందిన యువకుడితో వివాహం కుదిర్చారు. దీంతో ఆగ్రహించిన సత్యనారాయణ గతనెల 26న యువతి అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు రాజమండ్రికి చెందిన యువకుడికి వాట్సాప్‌లో పంపాడు. దీంతో యువకుడు యువతి కుటుంబసభ్యులను ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు యువతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాగిత సత్యనారాయణపై ఫిర్యాదు చేసినట్టు ఎస్సై చెప్పారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top