అడవి పంది అడ్డురావడంతో.. | Toofan vehicle roll over because of pig | Sakshi
Sakshi News home page

అడవి పంది అడ్డురావడంతో..

Mar 29 2018 7:22 AM | Updated on Aug 17 2018 2:56 PM

Toofan vehicle roll over because of pig - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ మండలం అందోలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూపాను వాహనం బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..కొమరం భీం జిల్లా జైనూరు మండలం జంగావ్‌ గ్రామానికి చెందిన కొంతమంది తూపాను వాహనంలో పెళ్లి శుభకార్యం(వలీమా)నకు మహారాష్ట్రలోని కిన్వట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా అడవిపంది దారికి అడ్డుగా రావడంతో డ్రైవర్‌ దానిని తప్పించబోయాడు.

ఈ గందరగోళంలో వాహనం అదుపుతప్పడంతో బోల్తాపడింది.  ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ఎనిమిదికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement