బాలుడిపై లైంగికదాడికి యత్నం

గోల్కొండ: ఓ బాలుడిపై అరబిక్ టీచర్ లైంగికదాడికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టోలిచౌకి పారామౌంట్ కాలనీకి చెందిన జీషాన్ ఎండీలైన్స్‌లోని మజీద్ అల్ కౌసర్‌లో అరబిక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మదర్సాలో నిర్వహిస్తున్న సమ్మర్ ఇస్లామిక్ క్యాంపులో విద్యార్థులకు అరబిక్ నేర్పుతున్నాడు. గత కొంత కాలంగా మదర్సాకు వస్తున్న ఓ బాలుడిని వేధించడమేగాక, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
పాటు తన మాట వినాలంటూ లేదంటే నీకు చదువు రాదంటూ భయపెట్టించాడు. ఈ నెల 13న అతను బాలుడిని మదర్సాలోని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అతడి భారినుంచి తప్పించుకున్న బాధితుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బుధవారం రాత్రి వారు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.