రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దుర్మరణం

Teacher Died in Car Accident Anantapur - Sakshi

అనంతపురం, నార్పల: ముచ్చుకోట క్రాస్‌ మద్దలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్‌ (45) గుదరగుట్టపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈయన తన పనుల నిమిత్తం శుక్రవారం అనంతపురంకు వెళ్లి స్వగ్రామానికి కారులో తన అన్న కుమారుడు సాయి తేజతో కలిసి వస్తున్నాడు. నార్పల మండలం ముచ్చుకోట క్రాస్‌ మద్దలపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. బస్సు కూడా బోల్తాపడింది. విజయ్‌కుమార్, సాయితేజలకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో విజయ్‌కుమార్‌ మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. 

ద్విచక్రవాహనంఅదుపుతప్పి మహిళ...
రాప్తాడు: గొల్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన అట్టె అలివేలమ్మ (44), ఆమె రెండో కుమారుడు సుధీర్‌ శుక్రవారం ఉదయం అనంతపురంలో నివాసం ఉన్న పెద్ద కుమారుడు ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అక్కడే మనరాలి నామకరణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇద్దరూ ద్విచక్ర వాహనంలో పోతులనాగేపల్లికి బయల్దేరారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలోకి రాగానే బైక్‌ అడుపుతప్పి కిందపడిపోయారు. అలివేలమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. కుమారుడు సుధీర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అనంతపరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ గంగాధర్‌ కేసును నమోదు చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top