హత్యాయత్నం కేసులో.. జేసీ అనుచరుడి అరెస్ట్‌

TDP Leader Arrested For Murder Attempt - Sakshi

రిమాండ్‌కు తరలింపు

డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి వెల్లడి

సాక్షి, తాడిపత్రి: ఏడీసీసీ బ్యాంకు మేనేజర్‌ హత్యాయత్నం కేసులో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి(పొట్టి రవి)ని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సురేష్‌బాబుతో కలిసి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గత నెల 28న తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత వంశీమోహన్‌రెడ్డి సోదరుడు ఏడీసీసీ బ్యాంకు మేనేజర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టి అతడిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన జేసీ వర్గీయులు శివశంకర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామాంజులరెడ్డి మరి కొందరు యత్నించారు.

అయితే బాధితుడు చాకచక్యంగా తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కాల్‌డేటా ప్రకారం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎస్వీ రవీంద్రారెడ్డి ప్రొద్బలంతోనే అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఎస్వీ రవీంద్రారెడ్డి కేసులపై విచారణ ఎస్వీ రవీంద్రారెడ్డిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని, వాటిపై లోతుగా విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు మట్కా, గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులను ప్రొత్సహించారన్నారు.

చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో పలుమార్లు పోలీసుల కౌన్సెలింగ్‌ జేసీ సోదరుల ప్రధాన అనుచరుడిగా ముద్రవేసుకున్న ఎస్వీ రవీంద్రారెడ్డిపై పలు నేరారోపణలున్నాయి. ఈక్రమంలో పోలీసులు అతడికి పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 2011లో అప్పటి జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా, 2012 నవంబర్‌లో అప్పట్లో స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్, స్థానిక పట్టణ పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. స్టేట్‌ బ్యాంకు మేనేజర్‌ స్వప్న మంజుల హత్యాయత్నం కేసులో (క్రైం నంబర్‌:148/18) నిందితుడు. అప్పట్లో అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయారు. మాట్లాడుతున్న డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top