తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు

Supreme court Issues Notice To TS Police over Woman Employee Suicide - Sakshi

సాక్షి, సంగారెడ్డి : మహిళా ఉద్యోగి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీబీఐ అధికారులతోపాటు బీహెచ్‌ఈఎల్‌ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో బీహెచ్‌ఈఎల్‌లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంస్థలో పై అధికారుల వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేహా సుసైడ్‌ నోట్‌లో‌ రాశారు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆదేశించారు. (బతికుండగానే చంపేశారు)

ఈ నేపథ్యంలో సుసైడ్‌నోట్‌లో ఉన్న ఎనిమిది మందిని మియాపూర్‌ పోలీసులు ఎందుకు విచారణ జరపలేదని అత్యున్నత ధర్మాసనం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అదే విధంగా లేఖలో ఉన్న బీహెచ్‌ఈఎల్‌ అధికారులు, ఇతర ఉద్యోగులపై కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళపై అధికారుల వేధింపులపై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. (వికాస్‌ దూబే మరో సహచరుడు అరెస్టు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top