ఐటీగ్రిడ్స్‌ కార్యాలయంలో ముగిసిన సోదాలు | SIT Completed Searches In IT Grids Office | Sakshi
Sakshi News home page

ఐటీగ్రిడ్స్‌ కార్యాలయంలో ముగిసిన సోదాలు

Mar 9 2019 9:42 PM | Updated on Mar 9 2019 9:42 PM

SIT Completed Searches In IT Grids Office - Sakshi

సిట్‌ ఇంచార్జి స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్‌ కార్యాలయంలో తెలంగాణ సిట్‌ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సిట్‌ బృందం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఈ బృందంలో సిట్‌ అధికారులతో పాటు క్లూస్‌టీం, టెక్నికల్‌ అనలిస్టులు, సైబర్‌ నిపుణులు కూడా పాల్గొన్నారరు. వీరందరి సమక్షలో డేటా విశ్లేషణ కొనసాగింది. సీజ్‌ చేసిన కంప్యూటర్‌లు, సర్వర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బాక్సులను గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయానికి పోలీసులు తరలించారు. రేపటి నుంచి గోషామహల్‌ స్టేడియంలో సిట్‌ విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement