విషం తాగిన ఎస్‌ఐ కుమార్తె

SI Daughter Drink Poison in Tamil Nadu - Sakshi

చెన్నై ,అన్నానగర్‌: విషం తాగిన ఓ యువతి  పోలీసుస్టేషన్‌కు వచ్చి కలకలం రేపింది. ఈ సంఘటన  ఆదివారం చోటుచేసుకుంది.  నెల్‌లై జిల్లా పాలై పోలీసుస్టేషన్‌కి ఆదివారం ఉదయం 20 ఏళ్ల యువతి తచ్చాడుతూ వచ్చింది. పోలీసులు యువతి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ యువతి తాను ఎస్‌ ఐ కూతురని,  బతకడం ఇష్టం లేదని చెప్పింది.   నాన్న ఎప్పుడూ తిడుతూ ఉంటాడని, చనిపోవాలనుకున్నానని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.   యువతి నోటి నుంచి విషం వాసన రావడంతో  పోలీసులు జీపులో ఎక్కించుకుని నెల్‌లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.  యువతి తండ్రికి పోలీసులు సమాచారం అందించారు. పోలీసుస్టేషన్‌లో కలకలం రేపిన ఆ యువతి పేరు,  వివరాలు పోలీసులు రహస్యంగా ఉంచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top