గ్యారేజీలో షార్ట్‌ సర్క్యూట్‌

Short circuit in the garage - Sakshi

 కాలిబూడిదైన మెకానిక్‌ షెడ్‌

మంటల్లో ప్రైవేటు మినీ బస్సు దగ్ధం

రూ. లక్షల్లో ఆస్తినష్టం  

షాద్‌నగర్‌రూరల్‌ : షాద్‌నగర్‌ పట్టణంలో మహరాజా దాబా వెనుక ఉన్న ఓ మెకానిక్‌ గ్యారేజీలో సోమవారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు, స్థానికు ల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వెంకటేష్‌ గత కొంతకాలంగా మహరాజా దాబా వెను క ఉన్న షెడ్‌లో వాహనాల రిపేరింగ్‌ గ్యారేజీని నిర్వహిస్తున్నాడు.

అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గ్యారేజీకి తాళం వెసి వెంకటేష్‌ ఇంటికి వెళ్లాడు. సోమ వారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఒక్కసారిగా మంటలు ఎసిగిపడ్డాయి. ప్రమాదంలో మరమ్మతుల కోసం వచ్చిన ప్రైవేట్‌ మినీ బస్సు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదు పు చేశారు.

పోలీసులు ఘటన స్ధలాన్ని సందర్శిం చి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్యారేజీలో వాహనాలకు సంబంధించిన విలువైన ఇంజన్లు, గేర్‌ బాక్సులు, ఆయిల్‌ పూర్తిగా కాలిపోయాయని, వాటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు.   

అత్యాధునిక మినీ బస్సు.. 

కొత్తూరులోని ప్యాపరస్‌ పోర్టు రిసార్టు నిర్వాహకులకు చెందిన మినీ బస్సును గత ఆరు నెలల క్రితం మరమ్మతుల కోసం గ్యారేజీకి తీసుకొచ్చినట్లు గ్యారేజీ నిర్వాహకుడు వెంకటేష్‌ తెలిపారు. మరమ్మతులు చేసినా బస్సు యజమానులు వాహనాన్ని తీసుకెళ్ల లేదని, దీంతో ఆరు నెలలుగా బస్సు గ్యారేజీలోనే ఉందన్నారు.

అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని, బస్సు సుమారు రూ. 80లక్షల వరకు ఉండవచ్చని, బస్సుల్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top