నమ్మించాడు..  ఉడాయించాడు!

Shop Owner Betrayed & Escaped In Satyanarayanapuram - Sakshi

రూ.5 లక్షల సరుకుతో పరారైన వ్యాపారి

కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, సత్యనారాయణపురం (విజయవాడ): నమ్మి ఐదు లక్షల విలువైన సరుకు పంపిస్తే గుట్టుచప్పుడు కాకుండా దుకాణం మూసివేసి యజమాని పరారైన సంఘటన సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం  ప్రకారం ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు వీధికి చెందిన గోపరాజు వెంకట శంకర్‌ కేసరీ పుడ్‌ ఫీడ్స్‌  పేరిట మొక్కజొన్నలు, వంట నూనెలు విక్రయిస్తుం టాడు. ఆయనకు 2016లో రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో రాకేశ్‌కు గాయత్రినగర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ సమీపంలో ఉన్న రక్షా ఇన్‌ఫ్యాక్ట్స్‌ దుకాణానికి సరుకును పంపించమన్నాడు. ఆదిలో వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగినా తర్వాతి కాలంలో 5 లక్షల విలువైన సరుకు పంపించగా అందుకు సంబందించిన ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిచిపోయాయి.

ఈమేరకు  డబ్బును వెంకట శంకర్‌ అడుగుతుండగా రాకేశ్‌రెడ్డి వాయిదా వేస్తూ వ చ్చాడు. ఈక్రమంలో వెంకట శంకర్‌కు పలువురు దుకాణం నడవడం లేదని, రాకేశ్‌ కని పించడం లేదని చెప్పడంతో పరిశీలించి చూడగా దుకాణం మూసివేసి పరారయ్యాడని గమనించాడు. దీంతో సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top