తరలిపోతున్న ఎర్ర బంగారం

Sandlewood Smuggling In Tirupai - Sakshi

ఏడు దశల్లో అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు

ప్రత్యేక పరిశీలన ద్వారా గుర్తించిన పోలీసులు

నిఘా మరింత పటిష్టం చేసిన టాస్క్‌ఫోర్స్‌

తిరుపతి సిటీ: రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని అడవుల్లో ఉన్న అరుదైన ఎర్రచదనం స్మగ్లర్ల పాలవుతోంది. ఈ అక్రమ రవాణా గత 30 ఏళ్లకు పైగా జరుగుతూనే వుంది. ఎక్కువగా తమిళనాడు రా ష్ట్రం జవ్వాదిమలై కొండల్లోని గిరిజన తెగలకు చెం దిన వేల కుటుంబాలు ఈ చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎం తోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అందరికీ  తెలిసిందే. అయితే ఏస్థాయిలో ఏవిధంగా ఎలాంటి వారు ఈ రవాణాలో పాల్గొంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. ఎర్రచందనానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడిన తర్వాత కొంతవరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అయితే స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ.. ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఐజీ డాక్టర్‌ మాగంటి కాంతా రావు ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దశలవారీగా అక్రమ రవాణా మూలాలను గుర్తించారు. ఆ వివరాల ప్రకారం ఎర్రచందనం సంపద ఏడు దశల్లో స్మగ్లర్లు నిర్వహిస్తున్నారు.

రవాణా ఇలా..
మొదటిదశలో తమిళనాడులోని అటవీప్రాంతాల్లో చెట్లను నరకడంలో సిద్ధహస్తులైన గిరిజన తెగలకు చెందినవారికి నగదు ఆశ చూపించి  ఇక్కడికి రప్పిస్తారు. రెండవ దశలో గిరిజన తెగలకు చెందిన  వారు నరికిన దుంగల బరువుకు తగిన విధంగా అడవుల్లోనే నగదు చెల్లింపులు చేస్తారు. ఈ దశలో మేస్త్రి కీలకపాత్ర పోషిస్తాడు. మూడవ దశలో నరికిన దుంగలను మేస్త్రి చెప్పినచోటకు చేర్చి అక్కడ ఏర్పాటు చేసిన వాహనంలో లోడ్‌ చేయడంతో తమిళనాడు స్మగ్లర్ల పని సమాప్తమవుతుంది. లోడ్‌ చేసిన వాహనాన్ని అనుకున్న చోటకు చేర్చడంలో వాహన డ్రైవర్‌కు.. పైలెట్‌గా వ్యవహరించే వ్యక్తి సమాచారం అందిస్తారు. నాల్గవ దశలో వాహనాన్ని తీసుకెళ్లడం, లోడ్‌ చేసిన వాహనాన్ని గమ్యస్థానం చేరేవరకు వివిధ రకాల వ్యూహాలను అనుసరించే ట్రాన్స్‌పోర్టర్‌ ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఐదవదశలో వాహనంలో వచ్చిన ఎర్రచందనం దుంగలను గోడౌన్‌లలో భద్రపరచడం, వాటిని కాపలా కాసే వ్యక్తి గోడౌన్‌ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఆరవ దశలో గోడౌన్‌ నుంచి విదేశాలకు పంపేందుకు కావాల్సిన అనుమతులు సృష్టించడం, దానికోసం లంచాలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడంలో ఎక్స్‌పోర్టర్‌ కీలకపాత్ర పోషిస్తాడు. ఇక ఏడవ దశలో ఎక్స్‌పోర్టర్‌ పంపిన దుంగలను అందుకుని వాటిని విక్రయిం చే ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ చివరగా పని పూర్తి చేస్తాడు. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు తన బృందంతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించారు. దుంగలను స్మగ్లింగ్‌ చేసే క్రమంలో ఒకవ్యక్తికి.. మరో వ్యక్తి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం ఇందులో గమనించాల్సి అంశమని టాస్క్‌ఫోర్సు పోలీసులు చెబుతున్నారు.

అర్ధరాత్రి అడవుల్లోవాహనాలు కనపడితే..
శేషాచల అటవీ శివార్లు, కరకంబాడీ, మామండురు, జూపార్క్‌ రోడ్డు, శ్రీవారి మెట్టు, భాకరాపేట తదితర చోట్ల తమిళనాడు రిజిస్ట్రేషన్‌  నంబరు కలిగిన వాహనా లు కనపడితే ఆయా ప్రాంతాల్లో మాటువేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్రమత్తం అవుతా రు. కూంబింగ్‌ చేస్తున్న  సిబ్బంది వెంటనే ఆ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయనే దిశగా పూర్తిస్థాయి నిఘా పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేసి అరెస్టు చేశారు. ఇటీవల అనుమానం వచ్చిన నాలుగైదు వాహనాలను సోదాలు చేయడంతో.. ఎర్రచందనం దుంగలు భారీగా పట్టుబడ్డాయి. ఒక వాహనానికి బీటెక్‌ చదివిన యువకుడు డ్రైవర్‌గా వచ్చి పోలీసులకు చిక్కాడు. గతంలోనూ డీగ్రీ, పీజీ చదివిన యువకులు స్మగ్లింగ్‌ కోసం వచ్చి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top