రూ.46 లక్షల లాటరీ వచ్చిందని..

Rs 16 Lakh Fraud By Fake Call For 46 Lakhs Lottery - Sakshi

సాక్షి, నిజమామాద్‌ : సైబర్‌ నేరస్తులు రూటు మార్చారు. గతంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టించి నగదు కాజేసిన నేరగాళ్లు.. తాజాగా గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు.  లాటరీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌లో జరిగిన సంఘటననే దీనికి నిదర్శనం. ఆర్మూరు మండలం చేవూరుకు చెందిన అశోక్‌కి ఇటీవల ఓ అజ్ఞాతవాసి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన పేరు మీద రూ.46లక్షల లాటరీ వచ్చిందని, రూ,16లక్షలు తమ అకౌంట్‌లో జమచేస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని నమ్మించారు.

లాటరీ డబ్బులు వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన అశోక్‌, ముత్తమ్మ దంపతులు.. పుస్తెల తాడుతో సహా ఇంటిని అమ్మేసి రూ.16లక్షలు సైబర్‌ నేరస్తుల అకౌంట్‌లో జమచేశారు. కొద్ది రోజుల తర్వాత అది ఫేక్‌ లాటరీ అని తెలిసింది. దీంతో అశోక్‌ దంపతులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు రికవరీ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top