నాలుగు నెలల గర్భిణిపై దాడి | Relatives Assault On Four Months Pregnant Woman | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల గర్భిణిపై దాడి

Sep 15 2018 7:20 AM | Updated on Sep 15 2018 7:20 AM

Relatives Assault On Four Months Pregnant Woman - Sakshi

ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పావని శ్వేతతో పాటు అత్త రమణ

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్‌ సెంటర్‌): నాలుగు నెలల గర్భిణిపై ఆమె బంధువులు దాడి చేసిన ఘటన ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గర్భిణి పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యచికిత్స పొందుతుంది. ఆమె, ఆమె భర్త, బంధువులు తాడేపల్లిగూడెంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పాకపాడుకు చెందిన చదనపల్లి వీరదాసు, పావ ని శ్వేతలు వేర్వేరు కులాలకు చెందిన వారు. ఇరువురు తల్లిదండ్రులది ఉప్పాకపాడే. వీరిద్దరూ ప్రేమించుకుని మే 17న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పావని శ్వేత గర్భం దాల్చింది.  నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె భర్తలతో కలిసి వినాయక చవితికి ముందు ఉప్పాకపాడు వెళ్లింది. వీరదాసు తండ్రి వారిని పండగ అయ్యే వరకు ఇక్కడే ఉండమనడంతో వారు అక్కడే ఉన్నారు.

గురువారం రాత్రి పావని శ్వేత బంధువులు నలుగురు ఆమె భర్త, మామ లేని సమయం చూసి వీరదాసు ఇంటి వద్ద ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్వేత, అత్త రమణను, పిన్ని కుమారిని, మరిది కాళీ కృష్ణలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్వేత గర్భిణి కావడంతో ఉదరంపై కాలితో బలంగా తన్నినట్లు చెప్పారు. దెబ్బలు తిన్న వీరిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు వివరాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement