మత్తు మందుకు గురైన బాధితులకు పరామర్శ | Railway SP Ashok Kumar Visits Victims At Mgm | Sakshi
Sakshi News home page

మత్తు మందుకు గురైన బాధితులకు పరామర్శ

Jun 4 2018 2:56 PM | Updated on Jun 4 2018 2:56 PM

Railway SP Ashok Kumar Visits Victims At  Mgm - Sakshi

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు  

ఎంజీఎం (వరంగల్‌) : సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందుకు గురై సృహ కోల్పోయిన బాధితులను రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైనా వైద్యచికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10 గంటలకు సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ యశ్వంత్‌ పూర్‌ టూ న్యూఢిల్లీ వెళ్తుండగా ఆరుగురు రైలు ఎక్కారన్నారు.

రైలు గంట ప్రయాణించిన తరువాత రైళ్లో ఇంకొందరు ఎక్కారు. వీరు ప్రయాణికులతో పరిచయం ఏర్పర్చుకుని సమోస, మజా, బిస్కెట్స్‌ తినిపించారు. వాటిని తినగానే ఆరుగురు వ్యక్తులు సృహ కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చినా వారు లేవకపోవడంతో తోటి ప్రయాణికులు మనించి రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు.

స్పందించిన రైల్వే కంట్రోల్‌ రూమ్‌ ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు కాజీపేట స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఇక్కడి ఇన్‌స్పెక్టర్, వైద్యులు అప్రమత్తమై అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి బాగానే ఉందని, ఒక్క ప్రయాణికుడు మాత్రం సృహాలోకి రాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement