దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!

Pregnant Woman Thrown Out From Train In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దివ్యను నిర్దాక్షణ్యంగా రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top