‘వర్షిత హత్య కేసులో రీకన్‌స్ట్రక్షన్‌’

Police Want To Scene Reconstruction In Varshitha Case At Chittoor - Sakshi

డీఎస్పీ రవిమనోహరాచారి వెల్లడి

చిత్తూరు, మదనపల్లె: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్‌ కల్యాణ మండపంలో ఇటీవల జరిగిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసును రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రవిమనో హరాచారి తెలిపారు. సోమవారం ఆయన వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. హత్యాచారం కేసులో నిందితుడిపై ఆధారాలు బలంగా ఉన్నాయన్నారు. నిందితునికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, పోర్టుమార్టం నివేదికలు రావడంతో కేసుకు మరింత బలం చేకూరిందన్నారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన తీర్పు వచ్చేలా చూస్తామన్నారు. డీఎస్పీ వెంట మదనపల్లె రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.
చదవండి: వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’
చదవండి: వర్షిత హంతకుడు ఇతడే!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top