
ఆత్మహత్య చేసుకున్న మల్లమ్మ
మదనపల్లె క్రైం: జీవితంపై విరక్తితో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. బసినికొండకు చెందిన ఆవుల నరసింహులు భార్య మల్లమ్మ(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం ఊరికి సమీపంలో ఉన్న రెడ్లచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
శనివారం సాయంత్ర శవం నీటిలో తేలాడుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రైనీ ఎస్పీ సతీష్‌కుమార్, ఎస్‌ఐ సునీల్ కుమార్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. విచారణలో ఆమె బసినికొండకు చెందిన నరసింహులు భార్యగా తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.