జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు.. | Old Man was Died In Rail Accident In jangaon | Sakshi
Sakshi News home page

జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు..

Dec 1 2018 10:01 AM | Updated on Dec 1 2018 10:02 AM

Old Man was Died In Rail Accident In jangaon - Sakshi

సాక్షి, జనగామ అర్బన్‌: జనగామ పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైల్లో నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్‌పల్లి గ్రామానికి చెందిన గంధారి లక్ష్మయ్య (70) హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో నవంబర్‌ 27న పోసాన్‌పల్లికి వచ్చిన లక్ష్మయ్య గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పెంబర్తి రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ బి. గణేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement