క్లాస్‌మేట్‌పై డిప్లొమా విద్యార్థి దారుణం

Odisha Teenager Set Ablaze By Classmate Dead - Sakshi

భువనేశ్వర్‌ : తన క్రూరవాంఛను తిరస్కరించిందనే కోపంతో టీనేజర్‌ను హతమార్చాడో కసాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన క్లాస్‌మేట్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కోరాపూట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... బాధితురాలు(17) సెమిలిగూడలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో డిప్లొమా చదువుతోంది. ఈ క్రమంలో గోపీనాథ్‌ ఖరా(18)  కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలంటూ మానసిక వేదనకు గురిచేసేవాడు. ఇందుకు బాధితురాలు తిరస్కరించడంతో కక్షగట్టిన.. గోపీనాథ్‌ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగా గత నెల 31న ఎవరూలేని సమయంలో బాధితురాలి ఇంట్లో చొరబడిన గోపీనాథ్‌.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గత పదిరోజులుగా కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతిచెందింది. దీంతో గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top