
కనకసబై, ఆనంద్‌రాజ్
ఆ ఇంటిని కాజేయడానికి కొందరు వేసిన కుట్రలో...
పెరంబూరు : నటుడు ఆనంద్‌రాజ్ తమ్ముడు కనకసబై ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పుదుచ్చేరిలోని స్వగృహంలో కనకసబై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అవివాహితుడైన కనకసభై వడ్డీ వ్యాపారం, చిట్టీల వ్యాపారం చేస్తాడనీ, వాటిలో నష్టం కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు. అయితే కనకసబైకి వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేవని, అతని ఆత్మహత్యకు వేరే కారణాలు ఉండవచ్చనే అనుమానాన్ని నటుడు ఆనంద్‌రాజ్ వ్యక్తం చేశారు. తన తమ్ముడు ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశాడని, ఆ ఇంటిని కాజేయడానికి కొందరు వేసిన కుట్రలో చిక్కుకోవడంతో కనకసభై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఓ లేఖను కనుగొన్నారు. తన ఆత్మహత్యకు కారకులు తన అన్నయ్య భాస్కర్, అతని కొడుకు శివ చంద్రన్ అని కనకసబై పేర్కొన్నట్లు ఉన్న లేఖ పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు వారిద్దిరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం జైలుకు తరలించారు.