పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య | Nalgonda Person Commits Suicide In PSR Nellore | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Oct 31 2018 1:26 PM | Updated on Nov 6 2018 8:08 PM

Nalgonda Person Commits Suicide In PSR Nellore - Sakshi

వెంకటేష్‌ మృతదేహం

నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో బాపూజీవీధిలో ఉన్న ఆర్‌కే లాడ్జిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన సామినేని వెంకటేష్‌(29) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన సామినేని వెంకటేష్‌ ఈ నెల 26వ తేదీన సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలోని సెజ్‌లో ఉద్యోగం కోసం వచ్చి బజారులోని ఆర్‌కే లాడ్జిలో దిగారు. లాడ్జిలో ఉంటూ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అన్నం పార్శిల్‌ తీసుకుని వేసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రానికి కూడా తీయకపోవడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తలుపులు పగులగొట్టి చూడగా బాత్‌రూంలో విగతజీవుడై పడి ఉన్నాడు. అతని పక్కనే బీరు బాటిల్, ఓ పురుగు మందు బాటిల్‌ ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్యను తట్టుకోలేక ఆత్యహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావించి అతని బంధువులకు సమాచారం అందించారు. లాడ్జి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement