మొహాలి వ్యక్తి వికార చేష్టలు.. మూడేళ్ల జైలు శిక్ష

Mohali Man Gets 3 Years in Jail Flying Kisses to Neighbour - Sakshi

చండీగఢ్‌: ఆడవారిని చూడగానే కొందరు మగాళ్లకు బుద్ధి వెర్రి తలలు వేస్తుంది. వారిని ఏడిపించాలని.. అసభ్యంగా ప్రవర్తించాలనే బుద్ధి పుడుతుంది. దాంతో పనికి మాలిన వేషాలు వేస్తుంటారు. అవతలివారికి చిర్రెత్తుకొస్తే.. ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి పంజాబ్‌ రాష్ట్రం మొహాలి పట్టణంలో జరిగింది. పొరుగింటి వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. దాని ఫలితం ఏంటంటే.. కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాలు.. వినోద్‌ అనే యువకుడు మొహాలిలోని ఓ హౌసింగ్‌ సొసైటీలో నివసిస్తున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో వినోద్‌ ప్లాట్‌కు ఎదురుగా ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది కాలం నుంచి వినోద్‌ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను చూడగానే ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇవ్వడం.. అసభ్యకర భంగిమలు చూపడం వంటివి చేస్తున్నాడు. దీని గురించి ఆ మహిళ తన భర్తకు చెప్పడం.. అతడు వినోద్‌కు వార్నింగ్‌ ఇవ్వడం కూడా జరిగాయి. కానీ వినోద్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో విసిగిపోయిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు వినోద్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.3వేల జరిమానా కూడా విధించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top