అస్సాంలో మరో మూక దాడి | Mob kills one, injures three in Assam over suspicion of cow theft | Sakshi
Sakshi News home page

అస్సాంలో మరో మూక దాడి

Aug 17 2018 2:48 AM | Updated on Sep 28 2018 3:39 PM

Mob kills one, injures three in Assam over suspicion of cow theft - Sakshi

గువాహటి: అస్సాంలో మరో మూక దాడి చోటుచేసుకుంది. జిల్లా సూపరింటెండెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఆవులను దొంగిలించి ఆటోలో తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు వ్యక్తులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. బుధవారం బిస్వాంత్‌ జిల్లా డిప్లొంగా టీ ఎస్టేట్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు సంకత్‌ తంతి అనే వ్యక్తికి చెందిన రెండు ఆవులను దొంగిలించి నంబర్‌ ప్లేట్‌ లేని ఓ ఆటోలో పారిపోతున్నారు. సాయం కోసం తంతి అరవగా గ్రామస్తులు వచ్చి వారిని అడ్డుకుని చితకబాదారు. పోలీసులొచ్చి వారిని ఆస్పత్రికి తరలించగా డెబెన్‌ రాజ్‌బోంగ్షి (35) అనే వ్యక్తి మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement