బైక్‌పై వెళ్తున్న జంటపై దాడి..

Mob Attacked On Unmarried Couple Goes On Bike In Assam - Sakshi

గువాహటి : నైతికత పేరుతో బైక్‌పై వెళ్తున్న జంటపై అస్సాంలోని పుకుర్‌పూర్‌ వాసులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాల్సిందిగా వారిపై ఒత్తిడి తెచ్చారు. జూన్‌19న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై గ్రామస్థుల చేతిలో దాడికి గురైన యువకుడి సోదరుడు మాట్లాడుతూ.. ‘బైక్‌పై వెళ్తున్న జంటను అడ్డగించిన గ్రామస్థులు.. యువతి, యువకులు జంటగా వెళ్లడంపై అభ్యంతరం తెలిపి దూషణలకు దిగారు. దానిని తప్పుగా భావించి వారిపై దాడి చేశారు. ఊరిలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ జంటపై ఒత్తిడి తీసుకుచ్చారు’ అని తెలిపారు.

ఈ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అస్సాం డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పోలీసులే ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top