అస్తవ్యస్తంగా పైప్‌లైన్‌..!

Mission Bhagiratha Pipeline Leakage Due To The Negligence Of Contractor - Sakshi

సాక్షి,నల్లగొండ : ఇంటింటికీ తాగునీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అధి కారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో అ బాసుపాలవుతోంది.    ఒకవైపు వేసవికాలం ప్రా రంభమై శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్న  మిషన్‌ భగీరథ పైపులైన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో  ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్న హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. 

అసంపూర్తి పైపులైన్లతో ఇబ్బందులు..
ఇంటింటికీ  తాగునీటిని సరఫరా చేసేందుకు గ్రామాల్లో పైపులైన్‌ నిర్మాణాలు జరుగకపోవడంతో కృష్ణా జలాలలకు సంబంధించిన జీఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న పైపులైన్లతో  సమస్యలు ఏర్పడుతున్నాయి. మండలకేంద్రం నుంచి మండలంలోని శాలిలింగోటం, రామగిరి, అంబారిపేట, గురుజాల, తుడిమిడి, చిత్తలూరు గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు వేసిన మెయిన్‌ పైపులైన్‌ను మండలకేంద్రంలోని బస్టాప్‌ వద్ద సుమారు 200 మీటర్ల మేర భూమిలో నుంచి వేయకుండా వదిలివేసి రోడ్డుపైనుంచే వేశారు. సుమారు సంవత్సర కాలంగా తాగునీటి మెయిన్‌ పైపులైన్‌ రోడ్డుమీదనుంచే ఉండటంతో పైపులైన్‌ పూర్తిగా ధ్వంసమైంది.  పైపులైన్‌ లీకేజీతో తాగునీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెయిన్‌ పైపులైన్లలో ఏర్పడిన రంద్రాలు, లీకేజీలను సరిచేసి తాగునీటిని అందించాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top